ఏ విషయంపై అయినా వ్యంగ్యంగా స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్‌ చేస్తుంటాడు. తాజాగా ఏ పండుగకు విష్‌ చేయని రామ్‌ గోపాల్‌ వర్మ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన ట్వీటర్‌ ద్వారా వరుస ట్వీట్లు చేస్తూ అందరికీ మేలు జరగాలని కోరాడు. 'అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు అంబానీని మించిన ఇల్లు, డబ్బు రావాలి. మీకు ఇప్పుడు, ఎప్పుడూ ఎలాంటి వైరస్‌ సోకకూడదు అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు, అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు దొరకాలి'. 'భర్తలను భార్యలు వేధించకూడదు. మీరు ఏం చేసినా ఏం చేయకున్నా మీతో మీ భార్యలు బాగుండాలి.' 'చిన్న సినిమా దర్శక నిర్మాతలకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ చిన్న సినిమాలు బాహుబలి కంటే పెద్ద హిట్‌ కావాలి.' 'నన్ను ద్వేషించే వారికోసం నేను త్వరగా చనిపోవాలి. అంటూ వరుస ట్వీట్లతో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)