విరాట్ కోహ్లి బాట‌లోనే భార‌త కెప్టెన్,స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికాపై విజ‌యనంత‌రం రోహిత్ త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించాడు.  వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని రోహిత్‌ పేర్కొన్నాడు.టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ విజేత‌గా నిల‌వ‌డం చాలా సంతోషం ఉంది. ఈ ట్రోఫీని సాధించ‌డమే నా ల‌క్ష్యంగా పెట్టుకున్నాను. ఈ క్ష‌ణం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను.  ఎంతో నిరాశకు గురయ్యాను.ఈ రోజు నా కల నేర‌వేరింది.  ఇక ఈ విజ‌యంతో నా అంత‌ర్జాతీయ టీ20 కెరీర్‌కు ముగింపు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్నాను. వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం లేదని" పోస్ట్ మ్యాచ్ ప్రెస్‌కాన్ఫ‌రెన్స్‌లో రోహిత్ పేర్కొన్నాడు. భార‌త జ‌ట్టుకు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను అందించిన రెండో కెప్టెన్‌గా రోహిత్ చ‌రిత్ర‌కెక్కాడు. టీ 20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్...బార్బడోస్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం...

అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 159 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌.. 4231 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచ‌రీలు, 32 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.   కాగా రోహిత్ కంటే ముందు భార‌త స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి సైతం అంత‌ర్జాతీ టీ20ల‌కు గుడ్‌బై చెప్పేశాడు.మరో స్టార్ ఆల్ రౌండర్ జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.

Here's ICC Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)