Saudi Airlines Plane Catches Fire: పాకిస్థాన్‌లోని పెషావర్ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుండగా సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానం నుంచి మంటలు, పొగలు వెలువడ్డాయి. (Saudi flight catches fire) దీంతో ఎమర్జెన్సీ ద్వారం ద్వారా ప్రయాణికులను కిందకు దించారు. ఆ విమానంలోని ప్రయాణికులు, 21 మంది సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. 297 మందితో ప్రయాణించిన సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం పాకిస్థాన్‌లోని పెషావర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా మంటలు చెలరేగాయి. రియాద్‌ నుంచి పెషావర్‌ చేరుకున్న ఆ విమానం ల్యాండింగ్ గేర్‌లో సమస్య తలెత్తింది. దీంతో ఒక టైర్‌ నుంచి పొగలు వ్యాపించాయి.  వీడియో ఇదిగో, విమానం టేకాఫ్ అవుతుండగా పేలిన టైర్లు, పైలట్ల అప్రమత్తతతో బ్రతికిన 176 మంది ప్రయాణికులు

కాగా, దీనిని గమనించిన ఏటీసీ సిబ్బంది పైలట్‌ను అప్రమత్తం చేశారు. ఆ విమానాన్ని వెంటనే రన్‌వే వద్ద నిలిపివేశారు. ఎమర్జెన్సీ డోర్‌ ద్వారా ప్రయాణికులను కిందకు దించారు. ఈ సంఘటనను సౌదీ ఎయిర్‌లైన్స్ ధృవీకరించింది. విమానం ఎమర్జెన్సీ డోర్‌ నుంచి ప్రయాణికులు దిగుతున్న వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)