టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో సూర్యకుమార్ పట్టిన క్యాచ్ సఫారీలను ప్రపంచకప్ కు దూరం చేసింది. టీమిండియాను టీ20 వరల్డ్ ఛాంఫియన్స్‌గా నిలిపింది. క్యాచ్ వివరాల్లోకి వెళితే దక్షిణాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు అవసరమయ్యాయి.హార్దిక్ పాండ్యా చివరి ఓవర్ వేయడానికి రెడీ అయ్యాడు. స్ట్రైక్‌లో కిల్లర్ మిల్లర్ ఉండటంతో దక్షిణాఫ్రికా కాన్ఫిడెంట్ గా ఉంది. తొలి బంతిని పాండ్యా.. ఫుల్ టాస్‌గా మిల్లర్‌కు సంధించాడు. దీంతో మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్సర్ అనే భావించారు. కానీ లాంగాఫ్‌లో ఉన్న సూర్య కుమార్ యాదవ్ పరిగెత్తుకుంటూ వచ్చి అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. టీ 20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్...బార్బడోస్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం...
క్యాచ్ పట్టే సమయంలో నియంత్రణ(బ్యాలెన్స్) కోల్పోయిన సూర్యకుమార్.. బౌండరీ రోపును దాటేశాడు. అయితే అది గ్రహించిన సూర్య జంప్ చేస్తూ బంతిని గాల్లోకి విసిరేశాడు. వెంటనే బౌండరీ రోపు నుంచి మైదానం లోపలకి తిరిగి వచ్చి సూపర్ మేన్‌లా అందుకున్నాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది.ఒకవేళ ఆ బంతి సిక్సర్‌గా వెళ్లి ఉంటే ప్రోటీస్ సమీకరణం అయిదు బంతుల్లో 10 పరుగులుగా మారిపోయేది. క్రీజులో ఉన్న మిల్లర్‌కు అది పెద్ద టార్గెట్ కాకపోయిండేది. సూర్యకుమార్ క్యాచ్‌కు సంబధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది.
Here's Video
SURYA KUMAR YADAV WHAT A CATCH!!!#INDvsSA | #T20WorldCup | #SAvIND pic.twitter.com/ZgmWDpGjz1
— Rupesh (@ChastooXD) June 29, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)