కర్ణాటకకు చెందిన ఓ యువకుడు పాములతో చెలగాటమాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. బారెడు పొడవున్న మూడు త్రాచుపాములను ముందు పెట్టుకుని.. వాటి తోకలను లాగుతూ చెలగాటమాడాడు. అందులో ఒక పాము కాస్తా ఎగిరి కాటేసింది. సదరు వ్యక్తి మోకాలి చిప్పను కరిచేసింది. అతడు ఎంత వదిలించుకుందామనుకున్నా ఆ పాము మాత్రం వదల్లేదు. చివరకు ఎలాగోలా దాని బారి నుంచి తప్పించుకున్నాడుగానీ.. ఇప్పుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఆ స్టంట్లు చేసిన వ్యక్తిని కర్ణాటకలోని సిర్సికి చెందిన మాజ్ సయ్యద్ గా గుర్తించారు.
సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి అతడు పాములతో ఆడిన వీడియోను ట్వీట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. పాములతో ఇలాంటి ఆటలు చాలా ప్రమాదకరమైనవని ఆయన హెచ్చరించారు. అతడు ఆసుపత్రిపాలైన ఫొటోలను ప్రియాంక కదమ్ అనే పాముల పరిరక్షణ ఉద్యమకర్త.. ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. సిర్సీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, ప్రస్తుతం అతడింకా తేరుకోలేదని తెలిపారు. మరోవైపు సయ్యద్ యూట్యూబ్ చానెల్ నిండా ఇలాంటి వీడియోలే ఉన్నట్టు తెలుస్తోంది.
This is just horrific way of handling cobras…
The snake considers the movements as threats and follow the movement. At times, the response can be fatal pic.twitter.com/U89EkzJrFc
— Susanta Nanda IFS (@susantananda3) March 16, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)