ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బాలుడి మృతదేహాన్ని తండ్రి బైక్‌పై తరలించిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన బాలుడు జేసవా మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బైక్‌పై తరలించాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. కొడుకు మృతదేహాన్ని 90 కిలోమీటర్లు బైక్‌పై తీసుకువెళ్లిన ఘటన రాష్ట్రంలో హెల్త్ కేర్ సెక్టార్‌లో దుస్థితిని అద్దం పడుతోందని అన్నారు. అలాగే బాలుడు మృతదేహాన్ని తండ్రి బైక్‌పై తరలిస్తున్న వీడియోను చంద్రబాబు ట్వీట్‌కు జత చేశారు.

రుయా అంబులెన్స్ దందాపై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ విషయాన్ని జాల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)