Denied Help, Father Carries Son's Body on Bike For 90 Kms (Photo-Video grab)

Tirupati, April 26: తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. అంబులెన్స్ యూనియన్ల రాక్షతత్వం (Tirupati RUIA Ambulance Mafia) కారణంగా ఓ తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని స్కూటర్‌పై తీసుకువెళ్లడం చూసినవారికి కంటతడిపెట్టించింది. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన బాలుడి జెసవ కిడ్నీ చెడిపోవడంతో చిన్న పిల్లలు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే మంగళవారం తెల్లవారు జామున ఆ బాలుడు మృతి చెందాడు.

దీంతో జెసవ మృతదేహాన్ని తలించెందుకు రాజంపేట నుంచి ఉచిత అంబులెన్స్ పంపిస్తే.. రుయా ఆస్పత్రిలోకి (RUIA Hospital) రాకుండా అంబులెన్స్ మాఫియా అడ్డుకుంది. దీంతో ద్విచక్ర వాహనంపై జెసవ మృతదేహాన్ని తరలించారు. సిండికేట్‌గా మారిన అంబులెన్స్‌ మాఫియా.. బాలుడి మృత దేహాన్ని తరలించడానికి రూ.20 వేలు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. రుయా అంబులెన్స్ దందాపై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ విషయాన్ని జాల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.  విద్యుత్‌ కొరతను అధిగమించేందుకు జగన్ సర్కారు కీలక నిర్ణయం, ఐదుగురు సభ్యులతో కోర్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ను ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

Her's  Chandra Babu Video Tweet

తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బాలుడి మృతదేహాన్ని తండ్రి బైక్‌పై తరలించిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన బాలుడు జేసవా మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బైక్‌పై తరలించాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. కొడుకు మృతదేహాన్ని 90 కిలోమీటర్లు బైక్‌పై (Father Carries Son's Body on Bike For 90 Kms) తీసుకువెళ్లిన ఘటన రాష్ట్రంలో హెల్త్ కేర్ సెక్టార్‌లో దుస్థితిని అద్దం పడుతోందని అన్నారు. అలాగే బాలుడు మృతదేహాన్ని తండ్రి బైక్‌పై తరలిస్తున్న వీడియోను చంద్రబాబు ట్వీట్‌కు జత చేశారు.