సోషల్ మీడియాలో (Social Media) ప్రతి రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సాధాణంగా జేసీబీలను ఏ చెరువు తవ్వడానికో లేదో ఇళ్లు కూల్చడానికో ఉపయోగిస్తాం. కానీ జేసీబీతో కూడా దొంగతనం చేయవచ్చని నిరూపించారు కొందరు దుండుగులు. ఏకంగా ఏటీఎం మిషన్ నే జేసీబీతో లాక్కెళ్లిపోయారు (ATM robbery with JCB). ఈ వీడియో ఏటీఎం సీసీటీవీ పుటేజీలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ గా మారింది.దీంతో నెటిజన్లు దొంగల ధైర్యాన్ని చూసి ఫిదా అవ్వడమే కాకుండా నిరుద్యోగం, ధరల పెరుగుదల కారణంగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయంటూ... ట్వీట్‌ చేశారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)