హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లా పరిధిలో 5వ నంబర్ జాతీయ రహదారిపై అమృత్ సర్ కు చెందిన ఓ వ్యక్తి కారులో వెళుతున్నాడు. రాను, పోను వాహనాలకు వేర్వేరు లేన్స్ ఉండి, రోడ్డు మధ్యలో ఎత్తయిన డివైడర్ కూడా ఉంది. తన మార్గంలో వెళుతున్న సదరు వ్యక్తి ఒక్కసారిగా కారును కుడివైపునకు తిప్పి డివైడర్ ఎక్కించేశాడు. అది డివైడర్ ను బలంగా తాకి అవతలి వైపున్న మార్గంలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కానీ, కారు మాత్రం బాగా డ్యామేజ్ అయింది. ధరంపూర్ పోలీస్ స్టేషన్ లో దీనిపై కేసు నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్ తో విన్యాసాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
#WATCH | HP: A video went viral showing a car jumping over a divider & colliding with railing on NH-5 in Solan; a resident from Amritsar tried performing stunts while rash driving. Vehicle damaged but driver safe. Case filed u/s 279 of IPC in Dharampur PS: Solan Police (25.07) pic.twitter.com/o5ajWRJuiG
— ANI (@ANI) July 25, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)