తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకేస్టాలిన్‌ మంగళవారం చెన్నై వీధుల్లో మాస్కులు పంపిణీ చేస్తూ కనిపించారు. రాష్ట్రం‍లో కరోనా కేసులు (Covid in Tamil Nadu) రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. సీఎం స్టాలిన్‌ మంగళవారం పార్టీ కార్యాలయం నుంచి క్యాంపు కార్యాలయానికి తిరిగి వెళ్తుండగా, కొంతమంది బహిరంగంగా మాస్కులు ధరించకపోవడాన్ని గమనించారు. వెంటనే రోడ్‌ పైనే కారు ఆపిన సీఎం (Tamil Nadu Chief Minister MK Stalin) స్థానికంగా ఉన్న వారికి స్వయంగా మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా అందరూ మాస్క్‌లు ధరించాలంటూ సీఎం స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎం స్టాలిన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇందులో ముఖ్యమంత్రే కొందరికి మాస్క్‌ పెడుతూ కనపడుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)