Eluru, July 23: ఏపీలో (AP) కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు (Heavy Rains) పలుప్రాంతాల‌లో రోడ్లు చెరువుల‌ను (Ponds) త‌ల‌పిస్తున్నాయి. గ‌త కొంత‌కాలంగా రోడ్ల మ‌ర‌మ్మ‌తు చేయ‌క‌పోవ‌డంతో గుంత‌ల‌తో పూర్తిగా పాడ‌య్యాయి. దీంతో ఏలూరు ప్రాంత ప్ర‌జ‌లు అధ్వాన రహదారులతో నిత్యం నరకం చూస్తున్నామని వాపోతున్నారు. వీధులు స‌రే ప్ర‌ధాన మార్గ‌లు సైతం గుంతలు నిండిన రోడ్లపై ప్రయాణానికి నానా అవస్థలు పడుతున్నామని, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న ప‌లితం లేకుండా పోయింద‌ని అంటున్నారు. దీంతో దీంతో కడుపు మండిన ఓ యువకుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. ఏలూరు జిల్లా కేంద్రం నుంచి మాదేపల్లి వెళ్లే రోడ్డులో ఫిల్‌ హౌస్‌ పేట వద్ద మడుగులా మారిన రోడ్డు మీద మంచం వేసుకుని పడుకున్నాడు. అటుగా వస్తున్న బస్సును ముందుకు వెళ్లనీయకుండా గంటసేపు ఆపేసి నిరసన తెలియజేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Naveen Patnaik Record: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కొత్త రికార్డు.. ఎక్కువ కాలం సీఎంగా కొనసాగిన రెండో వ్యక్తి.. జ్యోతిబసు రికార్డు బద్దలు

Road Accident: చెరువులో పడిన బస్సు.. 17 మంది జల సమాధి.. మరో 35 మందికి తీవ్ర గాయాలు.. బంగ్లాదేశ్‌లో ఘటన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)