ఢిల్లీతో జరిగిన పోరులో చెన్నై భారీ విజయంతో దుమ్మురేపింది. గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుందామనుకున్న ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 91 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తొలుత డెవాన్ కాన్వె(49 బంతుల్లో 87, 7ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు గైక్వాడ్(41) ,దూబే(32) రాణింపుతో చెన్నై 20 ఓవర్లలో 208/6 స్కోరు చేసింది. ఎన్రిచ్ నోర్జె(3/42), ఖలీల్ అహ్మద్(2/28) రాణించారు. లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ 17.4 ఓవర్లలో 117 పరుగులకు కుప్పకూలింది. మొయిన్ అలీ(3/13), ముకేశ్ చౌదరి(2/22), సిమర్‌జీత్‌సింగ్ (2/27), బ్రావో(2/24) సమిష్టి ప్రదర్శనతో ఢిల్లీ బ్యాటర్లు చేష్టలుడిగిపోయారు. మిచెల్ మార్ష్(25), శార్దుల్ ఠాకూర్(24) మినహా అందరూ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన తెలుగు బ్యాటర్ కేఎస్ భరత్(8) నిరాశపరిచాడు. పొదుపుతో పాటు కీలక వికెట్లు పడగొట్టిన మొయిన్ అలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Match 55. WICKET! 17.4: Khaleel Ahmed 0(1) b Dwayne Bravo, Delhi Capitals 117/10 https://t.co/8GNsHHA0pb #CSKvDC #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) May 8, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)