ఆఫ్గనిస్తాన్‌తో తొలి టీ20లో టీమిండియా కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన హిట్‌మ్యాన్‌ డకౌట్‌ అయ్యాడు. మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌట్‌ అయి పెవిలియన్‌ చేరాడు.ఊహించని ఈ పరిణామంతో కంగుతిని గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసంతృప్తితో డగౌట్‌ చేరాడు. ఈ నేపథ్యంలో నెట్టింట రోహిత్‌ శర్మ వీడియో వైరల్‌గా మారింది.

రోహిత్ శర్మ డకౌట్‌ వీడియో ఇదిగో, శుబ్‌మన్‌ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెవిలియన్ చేరిన టీమిండియా కెప్టెన్

అయ్యో పాపం.. రోహిత్‌ దురదృష్టం కారణంగానే ఇలా జరిగింది’’ అని అభిమానులు అంటుండగా.. మరికొంత మంది నెటిజన్లు మాత్రం.. ‘‘చూసుకుని ఆడాలి కదా! సీనియర్‌.. పైగా రీఎంట్రీ.. కెప్టెన్‌ ఇలా బాధ్యతారహితంగా ఆడితే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి?’’ అని ట్రోల్‌ చేస్తున్నారు.

Here's Troll Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)