ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ ఓ చెత్తరికార్డు నమోదు చేశాడు. ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక సార్లు టాస్‌ ఓడిన కెప్టెన్‌గా శాంసన్‌ నిలిచాడు. ఐపీఎల్‌-2022లో 13 సార్లు టాస్‌ ఓడిన శాంసన్‌.. ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా అంతకుముందు ధోని 2012 సీజన్‌లో 12 సార్లు టాస్‌ ఓడిపోయాడు. ఇక తొలి తొలి క్వాలిఫైయర్‌లో మ్యాచ్‌లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ 19.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి గెలుపొందింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లో ఫైనల్‌ చేరి హార్దిక్‌ పాండ్యా బృందం ఈ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)