ఐపీఎల్ 2022 సమరానికి అంతా రెడీ అయింది. మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మార్చి 29న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఐపీఎల్ ఛైర్మెన్ బ్రజేష్ పటేల్ తెలిపారు. ఈ టోర్న‌మెంట్‌లో 40 శాతం మంది ప్రేక్ష‌కుల‌ను మాత్ర‌మే అనుమ‌తించ‌నున్నారు.  కొత్త ఫ్రాంచైసీలు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ కూడా రోస్ట‌ర్‌లోకి వ‌స్తాయ‌న్నారు.టోర్నీ మొత్తం 74 మ్యాచ్‌లు జ‌రుగుతాయ‌ని బ్రిజేష్ ప‌టేల్ చెప్పారు.

వాటిలో 70 మ్యాచ్‌లు ముంబై వాంఖ‌డే స్టేడియం, బ్రాబౌర్న్ స్టేడియం, న‌వీ ముంబైలోని డీవై పాటిల్ గ్రౌండ్స్‌, పుణెలోని గ‌హుంజే స్టేడియంల‌లో జ‌రుగుతాయి. వాంఖ‌డే స్టేడియం, డీవై పాటిల్ గ్రౌండ్స్‌లో 20 చొప్పున‌, బ్రాబౌర్న్‌, గ‌హుంజే స్టేడియంల‌లో 15 చొప్పున మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయ‌ని తెలిపారు.

 

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)