ముంబైతో జ‌రిగిన మ్యాచ్‌లో ధోనీ త‌న ఫినిషింగ్ ట‌చ్‌తో ఐపీఎల్‌కు కొత్త కిక్ తెచ్చాడు. వ‌య‌సు పెరిగినా.. త‌న ప‌వ‌ర్ గేమ్‌లో ట్యాలెంట్ త‌గ్గ‌లేద‌ని ధోనీ మ‌రోసారి నిరూపించాడు. ఎంఎస్ ధోనీ ఛాంపియ‌న్ ఇన్నింగ్స్‌పై ఇవాళ మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు. వ‌య‌సు కేవ‌లం సంఖ్య మాత్ర‌మే అన్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. ధోనీ ఓ ఛాంపియ‌న్ క్రికెట‌ర్ అని, అత‌నో అసాధార‌ణ ఫినిష‌ర్ అని మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు. రోజు రోజుకీ ఈ లెజెండ‌రీ క్రికెట‌ర్ మ‌రింత ప‌రిణితి చెందుతున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)