సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌.. మరో కీలక మ్యాచ్‌ మిగిలి ఉండగానే స్వదేశానికి బయల్దేరాడు. కేన్ సతీమణి సారా రహీం రెండో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేన్‌ ఐపీఎల్ బయో బబుల్‌ని వీడి స్వదేశానికి పయనమయ్యాడు. దీంతో కేన్‌ మే 22న పంజాబ్ కింగ్స్‌తో జరిగే కీలకమైన మ్యాచ్‌కు దూరమయ్యాడు. కేన్‌ గైర్హాజరీలో భువనేశ్వర్‌ కుమార్‌ లేదా నికోలస్‌ పూరన్‌ ఆరెంజ్‌ ఆర్మీని ముందుండి నడిపించనున్నారు.

పంజాబ్‌తో మ్యాచ్‌కు విలియమ్సన్‌ అందుబాటులో ఉండడన్న విషయాన్ని సన్‌రైజర్స్‌ యాజమాన్యం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. విలియమ్సన్‌ దంపతులకు 2020 డిసెంబర్‌లో అమ్మాయి జన్మించింది.

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలు మిగతా మ్యాచ్‌లపై ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఢిల్లీ, ఆర్సీబీ, కేకేఆర్‌ జట్లు తమతమ చివరి మ్యాచ్‌ల్లో ఓడి, సన్‌రైజర్స్‌.. పంజాబ్ కింగ్స్‌పై భారీ తేడాతో గెలిస్తే ఆరెంజ్‌ ఆర్మీ ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)