టీమిండియా వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ దాదాపు 717 రోజుల తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌ ఆడి ఆకట్టుకున్నాడు. గురువారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఇషాంత్‌ 19 పరగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. కాగా ఈ ఏడాది జరిగిన మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇషాంత్‌ శర్మను రూ.50 లక్షలకు దక్కించుకుంది.

ఇక 2021లో చివరిసారి ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున మ్యాచ్‌ ఆడిన ఇషాంత్‌ ఆ సీజన్‌లో మూడు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు తీశాడు. కాగా 2019 వరకు మాత్రం రెగ్యులర్‌గా ఐపీఎల్‌ ఆడిన ఇషాంత్‌ ఆ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున 13 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇక ఓవరాల్‌గా 93 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ విషయానికి వస్తే కొన్నేళ్లగా టెస్టులకే మాత్రమే పరిమితమయ్యాడు. 108 టెస్టుల్లో 311 వికెట్లు, 80 వన్డేల్లో 115 వికెట్లు, 14 టి20ల్లో 8 వికెట్లు పడగొట్టాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)