స్వదేశంలో జరగనున్న ఐపీఎల్ 2023కి సర్వం సిద్ధం అయింది.వేలంలో ఉన్న ఆట‌గాళ్ల తుది జాబితాను ఐపీఎల్ పాల‌క మండలి మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. 405 మంది ప్లేయ‌ర్లు వేలంలో నిలిచారు. వీళ్ల‌లో 273 మంది భార‌తీయులు, 132 విదేశీ ఆట‌గాళ్లు ఉన్నారు. ఐపీఎల్ 2023 కోసం 991 మంది ఆట‌గాళ్లు పేర్లు న‌మోదుచేసుకున్నారు. అయితే, వీళ్ల‌లో 391 మందిని 10 జ‌ట్లు షార్ట్ లిస్ట్ చేశాయి. ఆ త‌ర్వాత 36 మందిని వేలం జాబితాలో చేర్చాల‌ని ఫ్రాంఛైజీలు కోరాయి. దాంతో, 405 మంది ఆట‌గాళ్లతో తుది జాబితాను రూపొందించింది. ప్ర‌స్తుత వేలంలో 89 స్లాట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇందులో 30 స్లాట్స్‌ను విదేశీ ఆట‌గాళ్ల‌కు కేటాయించారు. ఈ సీజ‌న్ ఐపీఎల్ స్పాన్స‌ర్‌షిప్ హ‌క్కులను టాటా కంపెనీ సొంతం చేసుకుంది.డిసెంబ‌ర్ 23వ తేదీన కొచ్చిలో మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల‌కు వేలం పాట మొద‌లుకానుంది.

Here's Total List

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)