మార్చి 31న ప్రారంభమైన ఐపీఎల్ 16వ సీజన్ పోటీలు అత్యంత ఆసక్తిగా సాగుతున్నాయి. కాగా, ఐపీఎల్ తాజా సీజన్ ప్లే ఆఫ్ మ్యాచ్ ల షెడ్యూల్ ను బీసీసీఐ నేడు విడుదల చేసింది. మొత్తం 70 మ్యాచ్ లతో కూడిన ఐపీఎల్ లీగ్ దశ మే 21న ముగియనుంది. మే 22 నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరగనున్నాయి.

క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్ లకు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమివ్వనుండగా... క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్ లకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలవనుంది.

ప్లే ఆఫ్ షెడ్యూల్...

మే 23- క్వాలిఫయర్ 1 (చెన్నై)

మే 24- ఎలిమినేటర్ (చెన్నై)

మే 26- క్వాలిఫయర్ 2 (అహ్మదాబాద్)

మే 28- ఫైనల్ (అహ్మదాబాద్)

Here's UPdate

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)