గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతో సాగిన పోరులో చివరకు ధోనీ సేనదే పైచేయి అయింది. వరుణుడి ఆటంకం మధ్య సాగిన పోరులో చెన్నై విజయానికి చివరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా.. రవీంద్ర జడేజా 6,4తో సూపర్‌ కింగ్స్‌ను సంబురాల్లో ముంచెత్తాడు.

చివరి ఓవర్‌ (మోహిత్ శర్మ)లో 13 పరుగులు అవసరం కాగా.. మొదటి నాలుగు బంతుల్లో మూడే పరుగులు రావడంతో చివరి రెండు బంతులు సమీకరణం 10 పరుగులుగా మారింది. దీంతో గెలుపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో చెన్నై ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అద్భుతమే చేశాడు. జడ్డూ వరుసగా సిక్స్‌, ఫోర్ బాదడంతో చెన్నై శిబిరం ఆనందంలో మునిగితేలింది. వీడియో ఇదిగో...

Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)