ఐపీఎల్‌-2024 వేలానికి ముందు రాజస్తాన్‌ రాయల్స్‌ టాపార్డర్‌ బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ను వదిలేసి.. అతడి స్థానంలో టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ ఆవేశ్‌ ఖాన్‌ను జట్టులోకి తీసుకుంది. మరో ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌తో డైరెక్ట్‌ స్వాప్‌ పద్ధతిలో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. లక్నోకు చెందిన ఆవేశ్‌ను తాము తీసుకుని.. బదులుగా పడిక్కల్‌ను ఆ ఫ్రాంఛైజీకి ఇచ్చింది. ఇందుకు సంబంధించి రాజస్తాన్‌ రాయల్స్‌ బుధవారం ప్రకటన విడుదల చేసింది.

కాగా ఐపీఎల్‌-2022 మెగా వేలంలో లక్నో ఫ్రాంఛైజీ రూ. 10 కోట్లు వెచ్చించి ఆవేశ్‌ ఖాన్‌ను కొనుగోలు చేసింది. ఈ క్రమంలో లక్నో తరఫున 22 మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్‌ పేసర్‌ 26 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు అదే ధరకు రాజస్తాన్‌ రాయల్స్‌కు ట్రేడ్‌ అయ్యాడు. ఇక గతంలో.. రాజస్తాన్‌ పడిక్కల్‌ను 7.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా.. ల​క్నో అంత మొత్తం అతడికి చెల్లించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకు మొత్తంగా 57 మ్యాచ్‌లు ఆడిన దేవ్‌దత్‌ పడిక్కల్‌.. 1521 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి.ఇక రాజస్తాన్‌ తరఫున పడిక్కల్‌ 28 మ్యాచ్‌లు ఆడి 637 పరుగులు సాధించాడు.

Avesh Khan and Devdutt Padikkal (photo-X)

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)