గాయం కారణంగా గత ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్-2023 సీజన్‌తో పాటు జూన్‌లో జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు వచ్చే నెలాఖరిలో ప్రారంభమయ్యే ఐపీఎల్ ద్వారా రీఎంట్రీ ఇస్తాడని వార్తలను బీసీసీఐ, ఐపీఎల్ వర్గాలు తాజాగా కొట్టిపారేశాయి.బుమ్రా గాయం గతంలో డాక్టర్లు నిర్ధారించిన దాని కంటే తీవ్రంగా మారిందని, అతను పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వెల్లడించారు. ప్రస్తుతం ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఫిట్‌నెస్ సాధించేందుకు శతవిధాల శ్రమిస్తున్నాడు.
Here's Update
Big blow for Mumbai Indians! #JaspritBumrah unlikely to be fit for #IPL2023 - Reportshttps://t.co/5gZloEmh5z
— Times Now Sports (@timesnowsports) February 26, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)