గుజ‌రాత్ టైట‌న్స్‌(Gujarat Titans)కు ఆరంభంలోనే బిగ్ షాక్ త‌గిలింది. కేన్ విలియ‌మ్స‌న్(Kane Williamson) టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. 16వ సీజ‌న్ ఆరంభ పోరులో గాయ‌ప‌డిన అత‌ను స్వ‌దేశానికి ప‌య‌న‌మ‌య్యాడు. కుడి మోకాలికి ప‌ట్టీతో, రెండు క‌ర్ర‌ల సాయంతో నిల్చొని ఉన్న త‌న‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

‘థాంక్యూ గుజ‌రాత్ టైట‌న్స్‌. గ‌త రెండు రోజులుగా నాకు అన్నివిధాలా స‌పోర్ట్ చేసిన మంచి మ‌నుషుల‌కు థాంక్స్‌. కాలి గాయం నుంచి కోలుకునేందుకు స్వ‌దేశం బ‌య‌లుదేరుతున్నాను’ అని క్యాష్ష‌న్ రాశాడు. ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ విలియ‌మ్స‌న్ తొంద‌ర‌గా కోలుకో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)