ఐపీఎల్ 2022 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కథ ముగిసింది. ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించిన కేకేఆర్‌ ఓటమితో ముగించి లీగ్‌ నుంచి నిష్క్రమించింది. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైన శ్రేయస్‌ సేన.. ప్రస్తుత ఎడిషన్‌లో 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 8 పరాజయాలు నమోదు చేసింది. చెన్నైపై గ్రాండ్‌ విక్టరీతో సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన శ్రేయస్‌ సేన.. ఆతర్వాత ఆర్సీబీ చేతిలో ఘోరంగా ఓడింది.

ఆ తర్వాత పంజాబ్‌, ముంబైలపై భారీ విజయాలు సాధించినప్పటికీ.. ఢిల్లీ, సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఢిల్లీ చేతిలో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో పరాజయంపాలైంది. తిరిగి రాజస్థాన్‌పై గెలిచినా మళ్లీ లక్నో చేతిలో ఓడింది. ఈ దశలో మేలుకున్న కేకేఆర్‌.. ముంబై, సన్‌రైజర్స్‌లపై వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో లక్నో చేతిలో ఓటమిపాలై లీగ్‌ నుంచి నిష్క్రమించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)