మహేంద్ర సింగ్ ధోనీ మ‌రోసారి ఫినిషింట్ ట‌చ్‌తో అదరగొట్టాడు. ఐపీఎల్‌లో గురువారం ముంబైతో జ‌రిగిన మ్యాచ్ ఫైన‌ల్ ఓవ‌ర్‌లో థ్రిల్లింగ్ ఇన్నింగ్స్‌తో ధోనీ ఆక‌ట్టుకున్నాడు. చెన్నై విజయానికి చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన దశలో.. ఉనాద్కట్‌ వేసిన తొలి బంతికి ప్రిటోరియస్‌ ఔట్‌ కాగా.. రెండో బంతికి బ్రేవో సింగిల్‌ తీసి ధోనీకి స్ట్రయికింగ్‌ ఇచ్చాడు. దీంతో  నాలుగు బంతుల్లో 16 పరుగులు కావాల్సి ఉండగా.. ఆ ద‌శ‌లో ధోనీ త‌న స్ట‌యిల్లో చెలరేగిపోయాడు. మూడో బంతికి బౌలర్‌ తల మీదుగా భారీ సిక్సర్‌ అరుసుకున్న ధోనీ.. నాలుగో బాల్‌కు ఫైన్‌ లెగ్‌ దిశగా బౌండ్రీ రాబట్టాడు. ఐదో బంతికి రెండు పరుగులు రాగా.. ఆఖరి బాల్‌కు ఫోర్‌ కొట్టిన ధోనీ తనదైన శైలిలో మ్యాచ్‌కు ఫినిషింగ్ ఇచ్చేశాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)