ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. ఐదో మ్యాచ్‌లోనైనా గెలుపు బోణీ కొట్టాలన్న ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్‌ ఆశలు నెరవేరలేదు. బుధవారం ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 12 పరుగులతో ముంబైకి షాకిచ్చింది. మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 198/5 స్కోరు చేసింది. ధవన్‌ (50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) మయాంక్‌ అగర్వాల్‌ (32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 52) హాఫ్‌ సెంచరీలు చేశారు. చివర్లో జితేశ్‌ శర్మ (15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 నాటౌట్‌) ధాటిగా ఆడాడు. థంపీ రెండు వికెట్లు తీశాడు.

ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 186/9 స్కోరుకే పరిమితమైంది. బ్రేవిస్‌ (25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 49), తిలక్‌వర్మ (20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36) ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించగా.. సూర్యకుమార్‌ (30 బంతుల్లో ఫోర్‌, 4 సిక్సర్లతో 43) ఫామ్‌ చాటాడు. ఓడియన్‌ స్మిత్‌ 4, రబాడ 2 వికెట్లు తీశారు. మయాంక్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఐపీఎల్‌ సీజన్‌లో తొలి ఐదు మ్యాచ్‌ల్లో రెండుసార్లు ఓడిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్‌ నిలిచింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)