చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఎంత ఒత్తిడి సమయంలోనైనా ప్రశాంతంగా ఉంటాడనే విషయం తెలిసిందే. అందుకే అందరూ మిస్టర్ కూల్`` అంటుంటారు. అయితే పతిరనాపై అసహనం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతోంది. విషయం ఏంటంటే..రాజస్థాన్ (RR) ఇన్నింగ్స్ 16వ ఓవర్ పతిరనా వేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని హెట్‌మెయిర్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అది హెట్‌మెయిర్ కాలికి తగిలి ధోనీ వైపు వెళ్లింది. ధోనీ వెంటనే బంతిని అందుకుని నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు పరిగెడుతున్న హెట్‌మెయిర్‌ను రనౌట్ (Run out) చేసేందుకు ప్రయత్నించాడు.

బంతిని బలంగా విసిరాడు. అయితే పిచ్ మధ్యలో ఉన్న పతిరనా ఆ బంతిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు.ధోనీ బాల్ విసిరే సమయానికి హెట్‌మెయిర్ క్రీజులోకి చేరుకోలేదు. ఆ బాల్ వికెట్లకు తగిలి ఉంటే హెట్‌మెయిర్ కచ్చితంగా రనౌట్ అయ్యేవాడు. మధ్యలో పతిరీనా ఆడ్డురావడంతో ధోనీకి కోపం వచ్చింది. పతిరీనాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే శివమ్ ధూబే సరిగ్గా బంతిని విసరలేకపోవడం వల్ల బ్యాట్స్‌మెన్ మూడు పరుగులు చేసేశారు. అప్పుడు కూడా ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

MS Dhoni

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)