స‌న్‌రైజ‌ర్స్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి క‌ళ్లు చెదిరే క్యాచ్ ప‌ట్టాడు. గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో .. స‌న్‌రైజ‌ర్స్ ఫీల్డ‌ర్ రాహుల్ త్రిపాఠి.. గాల్లోకి ఎగురుతూ సూప‌ర్ క్యాచ్ అందుకున్నాడు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో బ్యాట‌ర్ శుభ‌మ‌న్ గిల్‌.. ఆఫ్ సైడ్‌లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించాడు. చాలా వేగంగా ఆ బంతి గాల్లో క‌వ‌ర్స్ మీదుగా బౌండ‌రీ దిశ‌గా వెళ్తోంది. అయితే అక్క‌డ ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్‌.. త‌న ఎడ‌మ వైపుకు దూకి .. ఎడ‌మ చేతితో బంతిని క్యాచ్ ప‌ట్టేశాడు. అద్భుతంగా ఆ క్యాచ్‌ను అందుకోవ‌డంతో గిల్ నిరాశ‌చెందాడు. ఆ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ఇదే. ఈ మ్యాచ్‌లో హైద‌రాబాద్ జ‌ట్టు గుజ‌రాత్‌పై గెలుపొందింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)