ఐపీఎల్‌ 17వ సీజన్‌లో మాజీ చాంపియన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ సొంతగడ్డపై వరుసగా రెండో విజయాన్ని సాధించింది. టాపార్డర్‌ చేతులెత్తేసిన వేళ రియాన్‌ పరాగ్‌ (45 బంతుల్లో 84 నాటౌట్‌; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లందరినీ ఉతికి ఆరేయడంతో రాజస్తాన్‌ రాయల్స్‌ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. టాస్‌ గెలిచిన ఢిల్లీ బౌలింగ్‌ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రిషబ్ పంత్ ప్రస్టేషన్ వీడియో ఇదిగో, అసహనంతో బ్యాట్‌ను కర్టెయిన్‌కేసి బాదిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్

ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రియాన్‌ పరాగ్‌ ఒంటిచేత్తో స్కోరుబోర్డును హోరెత్తించాడు. ఖలీల్, ముకేశ్, నోర్జే, అక్షర్, కుల్దీప్‌ తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసి ఓడింది. డేవిడ్‌ వార్నర్‌ (34 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (23 బంతుల్లో 44 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. బర్గర్, చహల్‌ చెరో 2 వికెట్లు తీశారు. ఇక రాత్రికిరాత్రి రాజస్థాన్‌ ఫ్యాన్స్‌ రియాన్‌ను హీరోలా చూడటం మొదలుపెట్టారు. నిన్న రాత్రి నుంచి సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా రియానే కనిపిస్తున్నాడు. ఇతనికి సంబంధించిన పాత వీడియోలు, ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)