సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఏకైక ఐపీఎల్ ట్రోఫీని అందించిన డేవిడ్ వార్నర్‌ను సన్ రైజర్స్ తన ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ ఖాతాలలో బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా వార్నరే స్క్రీన్ షాట్స్ తీసి మరీ వెల్లడించాడు. సన్ రైజర్స్ తనను బ్లాక్ చేసిందని స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ.. ‘ట్రావిస్ హెడ్ షేర్ చేసిన పోస్ట్‌ను రీపోస్ట్ చేయాలని ప్రయత్నించాను. కానీ సన్ రైజర్స్ నన్ను బ్లాక్ చేసింది.. ’అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు. వార్నర్ ఈ పోస్టు చేసిన వెంటనే అతడి అభిమానులు హైదరాబాద్ ఫ్రాంచైజీపై దుమ్మెత్తిపోస్తున్నారు.
కాగా ఐపీఎల్ మినీ వేలం – 2024 సందర్భంగా ఆసీస్ సూపర్ స్టార్స్ పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్‌లు భారీ ధర దక్కించుకున్న విషయం తెలిసిందే. కమిన్స్‌కు రూ. 20.50 కోట్లు వెచ్చించిన ఎస్‌ఆర్‌హెచ్.. ట్రావిస్ హెడ్‌కు రూ. 6.8 కోట్లు దక్కాయి. ఈ ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్పేందుకు గాను వార్నర్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని చూశాడు. కానీ సన్ రైజర్స్ మాత్రం వార్నర్‌ను బ్లాక్ చేసింది.
Here's News
SRH have blocked David Warner from Twitter/X and Instagram. pic.twitter.com/ZH3NSQ3yzV
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 19, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
