ఐపీఎల్ 15వ సీజన్‌లో ఓటమి ఎరుగకుండా సాగుతున్న గుజరాత్ టైటాన్స్.. హైదరాబాద్ చేతిలో పరాజయం పాలైంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సన్‌రైజర్స్.. సోమవారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (42 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. అభినవ్ మనోహర్ (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, భువనేశ్వర్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 19.1 ఓవర్లలో 2 వికెట్లకు 168 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (46 బంతుల్లో 57; 2 ఫోర్లు, 4 సిక్సర్లు )కీలక ఇన్నింగ్స్‌తో జట్టును నడిపించగా.. అభిషేక్ శర్మ (32 బంతుల్లో 42; 6 ఫోర్లు), నికోలస్ పూరన్ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ షాట్‌లతో లక్ష్యాన్ని కరిగించారు. విలియమ్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా నేడు చెన్నైతో బెంగళూరు తలపడనుంది.
Nicholas Pooran hits the winnings runs as @SunRisers win by 8 wickets against #GujaratTitans
Scorecard - https://t.co/phXicAbLCE #SRHvGT #TATAIPL pic.twitter.com/F5o01VSEHv
— IndianPremierLeague (@IPL) April 11, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)