ఐపీఎల్-2022లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 70 బంతుల్లోనే 140 పరుగులు డికాక్ విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి. ఇక డికాక్‌కు ఐపీఎల్ కెరీర్‌లో రెండో సెంచరీ. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తన తొలి సెంచరీను డికాక్ నమోదు చేశాడు. అదే విధంగా ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసిన మూడో ఆటగాడిగా డికాక్ నిలిచాడు. అంతకు ముందు క్రిస్ గేల్(175), బ్రెండన్ మెకల్లమ్(158) పరుగులు సాధించారు. ఇక సునామీ ఇన్నింగ్స్ ఆడిన డికాక్‌పై ట్విటర్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది.
CENTURY for Quinton de Kock off just 59 deliveries.
His second in #TATAIPL 👏👏 #KKRvLSG pic.twitter.com/Migx1iDVmu
— IndianPremierLeague (@IPL) May 18, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)