చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించి ఐపీఎల్-2024లో బోణీ కొట్టింది. 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో బెయిర్ స్టో క్యాచ్‌ను అందుకున్న కోహ్లి.. టీ20 క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత క్రికెటర్‌గా అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి ఇప్పటివరకు టీ20ల్లో 173 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా పేరిట ఉండేది. టీ20 క్రికెట్‌లో రైనా 172 క్యాచ్‌లు అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో రైనా ఆల్‌టైమ్ రికార్డును కింగ్ కోహ్లి బ్రేక్ చేశాడు. టీ20ల్లో 100 సార్లు 50 ప్లస్ రన్స్, తొలి భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు, తొలి స్ధానంలో కొనసాగుతున్న క్రిస్ గేల్
Here's News
Virat Kohli Completes Most Catches in T20 Format By An Indian Cricketer, Achieves Feat During RCB vs PBKS IPL 2024 #ViratKohli #RCBvsPBKS #IPL #IPL2024 https://t.co/Om3DWkak2w
— LatestLY (@latestly) March 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)