ఐపీఎల్‌-2024లో తొలి సెంచరీ నమోదైంది. జైపూర్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ విరాట్‌ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 67 బంతుల్లో విరాట్‌ తన సెంచరీని మార్క్‌ను అందుకున్నాడు. ఇది విరాట్‌కు 8వ ఐపీఎల్‌ సెంచరీ. తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో రన్‌మిషన్‌ అభిమానులను అలరించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 72 బంతులు ఎదుర్కొన్న కింగ్‌ కోహ్లి.. 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ కోహ్లితో పాటు కెప్టెన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌(44) పరుగులతో రాణించాడు. రాజస్తాన్‌ బౌలర్లలో యజువేంద్ర చాహల్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. బర్గర్‌ ఒక్క వికెట్‌ సాధించాడు. హోం గ్రౌండ్ లో గ్రాండ్ విక్ట‌రీ కొట్డిన హైద‌రాబాద్, ఈ సీజ‌న్ లో రెండో విజ‌యం సాధించిన ఆరెంజ్ ఆర్మీ

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)