చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించి ఐపీఎల్‌-2024లో బోణీ కొట్టింది. 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో "ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌"గా నిలిచిన ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి.. ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉండిన సీఎస్‌కే మాజీ కెప్టెన్‌ ఎం​ఎస్‌ ధోని రికార్డును కోహ్లి సమం చేశాడు. ఐపీఎల్‌లో ధోని ఇప్పటివరకు 17 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకోగా.. నిన్నటి మ్యాచ్‌తో కోహ్లి ఆ సంఖ్యను (17) సమం చేశాడు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్‌ మాజీ సారధి రోహిత్‌ శర్మ టాప్‌లో ఉన్నాడు. రోహిత్‌ ఖాతాలో 19 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు ఉన్నాయి.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)