ఐపీఎల్‌-2023లో భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు శివమ్‌ దూబే బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 25 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 27 బంతులు ఎదుర్కొన్న 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో దుబే సీఎస్‌కే ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌ వేసిన హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో 111 మీటర్ల భారీ సిక్సర్‌ కొట్టాడు. అతడి పవర్‌కు బంతి స్టేడియం రూఫ్‌ మీద పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)