ముంబై ఇండియన్స్‌, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంతి కనిపించకపోవడంతో ఇషాన్‌ కిషన్‌ కాసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ కుమార్‌ కార్తికేయ వేశాడు. ఓవర్‌ నాలుగో బంతిని నితీష్‌ రాణా రివర్స్‌ స్వీప్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బాటమ్‌ ఎడ్జ్ అవడంతో అక్కడే రోల్‌ అయింది. బంతి ఎక్కడ కనిపించకపోవడంతో కీపర్‌ ఇషాన్‌ అలాగే నిల్చుండిపోయాడు.అయితే బంతి అతని కింద నుంచి వెళ్లడం గమనించలేదు. ''అరె ఇషాన్‌.. బంతి నీ పక్కనే ఉంది'' అంటూ కుమార్‌ కార్తికేయ పేర్కొన్నాడు.

అప్పటికే నితీష్‌ రాణా సింగిల్‌ పూర్తి చేశాడు. బంతిని అందుకున్న బుమ్రా ఇషాన్‌ చూస్తూ ఏమైంది అంటూ నవ్వాడు. ఇషాన్‌ కూడా ఏంటో ఏం అర్థం కాలేదు అన్నట్లుగా ఒక లుక్‌ ఇచ్చాడు. దీంతో మైదానంలో ఆటగాళ్ల మధ్య నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)