ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జీబీఎస్ వైరస్ విజృంభిస్తోంది. 4 రోజుల్లో ఏడు జీబీఎస్ వైరస్ కేసులు(Andhra Pradesh GBS Virus Cases) నమోదయ్యాయని గుంటూరు(Guntur) ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రమణ యశస్వి తెలిపారు. వారిలో ఇద్దరి డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారన్నారు.
GBS వైరస్ పట్ల ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన పని లేదని స్పష్టం చేశారు(GBS Virus Cases). కాళ్లు, చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని సూచించారు. దీనికి సంబంధించి వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
వ్యాధి సోకిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళన కరంగా ఉందన్నారు. ఒకరు వెంటిలేటర్‌పై, మరొకరు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. గతంలో ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్ వచ్చి పోయిన కొన్ని రోజుల తర్వాత ఈ వ్యాధి సోకుందని తెలిపారు. ఇది ప్రాణాంతకం కాదని ఒకరి నుండి మరొకరి సోకదని తెలిపారు. ఎలాంటి ఐసోలేషన్ అవసరం లేదని.. తొలుత నాడి వ్యవస్థపై ప్రభాశం చూపుతుందన్నారు రమణ యశస్వి.
7 GBS Virus Cases Reported in 4 Days at Andhra Pradesh
4రోజుల్లో 7 GBS వైరస్ కేసులు.....
GGHలో 4రోజుల్లో 7 GBS వైరస్ కేసులు నమోదయ్యాయని గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ సూపరింటెండెంట్ రమణ యశస్వి తెలిపారు. వారిలో ఇద్దరి డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారన్నారు. GBS వైరస్ పట్ల ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన పని లేదని స్పష్టం చేశారు. కాళ్లు, చేతులు… pic.twitter.com/XIMUQYe49F
— ChotaNews App (@ChotaNewsApp) February 14, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)