ఒంగోలు రాజీవ్ గాంధీ మెడికల్ కాలేజీలో కొంత మంది మెడికల్ విద్యార్థులు క్లాస్ రూమ్‌లోనే కొట్టుకున్నారు. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు క్లాస్ రూంలోనే చితకబాదుకున్నారు.ఈ ఘర్షణలో కొంత మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తలకు, ముఖంపై గాయాలు కావడంతో పలువురు విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టారు.సమగ్ర దర్యాప్తు చేసి ఇరువర్గాలకు చెందిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు.

‘కొంత మంది విద్యార్థులు మద్యం తాగొచ్చి న్యూసెన్స్ చేస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో.. ఈ ఏడాది ఆగస్టులో కళాశాల ప్రిన్సిపల్, కమిటీ వారు విచారణ జరిపి మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. వారిని హాస్టల్ నుంచి బయటకు పంపించేశారు. హాస్టల్ బయట నుంచే వారు తరగతులకు హాజరవుతున్నారు. వాళ్లు ఆ విధంగా హాస్టల్లో లేకుండా చేయడానికి కారణమైన కొంత మంది విద్యార్థులపై సస్పెండ్ అయిన విద్యార్థులు కక్ష పెంచుకున్నారని డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు.అందులో భాగంగానే దాడి జరిగిందని డీఎస్పీ తెలిపారు.

Ongole RIMS Medical College Students divided into two groups and crushed is creating a stir

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)