విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో పలు అక్రమాలు, అవినితీ ఆరోపణకు సంబంధించి న్యాయం చేయాలంటూ ఈ రోజు తలపెట్టిన చలో ఏయూ కార్యక్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీ పూర్వ విద్యార్థుల సంఘం పిలుపు మేరకు చలో ఏయూ కు పిలుపునివ్వగా మరో వర్గం దీన్ని వ్యతిరేకిస్తు ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా రెండు వర్గాలకు అనుమతి నిరాకరించి ఆంధ్ర వర్సిటీ, పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. చలో ఏయూ నేపథ్యంలో టీడీపీ, జనసేన, సీపీఎం నేతలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)