చిత్తూరు జిల్లాలో అంతిమయాత్రకు వచ్చిన వారిలో ముగ్గురు విద్యుదాఘాతంతో మృతి చెందడం స్థానికులను కలచివేసింది. పోలీసుల కథనం ప్రకారం.. కుప్పం పురపాలక సంఘం పరిధిలోని తంబిగాని పల్లెకు చెందిన రాణి (65) అనారోగ్యంతో మృతి చెందింది. శుక్రవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు అంతిమ యాత్ర చేపట్టారు.

శ్మశానం వద్ద విద్యుత్ తీగలు కిందకు ఉండడంతో పాడె మోస్తున్న నలుగురు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన తిరుపతి, మునెప్ప, గుంటూరుకు చెందిన రవీంద్రన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Representational image (Photo Credit- Pixabay)

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)