కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలో అపశృతి చోటు చేసుకుంది. పరుగు పందెంలో పడిపోయి యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లగా..పోలీస్ కానిస్టేబుల్స్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు ఏ.కొండూరు గ్రామానికి చెందిన దారావత్తు చంద్రశేఖర్(25)తన స్నేహితుడు గోపితో కలిసి మచిలీపట్నం వచ్చాడు. 1600 మీటర్ల పరుగు పందెంలో సొమ్మసిల్లి కింద పడిపోయాడు. అతడిని చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. సమాచారాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు తెలియజేశారు.
1600 మీటర్ పరుగు పందెంలో కుప్పకూలి పడిపోయిన యువకుడు
కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలో అపశృతి.. పరుగు పందెంలో పడిపోయి యువకుడు మృతి
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షలు
ఉద్యోగ నియామక ప్రక్రియలో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో… pic.twitter.com/5ae7CBB0yE
— Telugu Scribe (@TeluguScribe) January 2, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)