లడఖ్‌లో శిక్షణలో భాగంగా యుద్ధ ట్యాంకుతో నదిని దాటే విన్యాసాలను చేస్తున్న సమయంలో అకస్మికంగా వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఇందులో ఏపీకి చెందిన ముగ్గురు జవాన్లు ఉన్నారు. జవాన్లు సుభాన్ ఖాన్, నాగరాజు, కృష్ణారెడ్డి మృతి చెందారు. తాజాగా లద్దాఖ్ ప్రమాదంలో చనిపోయిన జవాన్ల భౌతికకాయాలు విజయవాడ చేరుకున్నాయి. గ్వాలియర్ నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో జవాన్ల భౌతికకాయాలను తీసుకువచ్చారు. జవాన్ల భౌతికకాయాలను బాపట్ల, పెడన, గిద్దలూరుకు అధికారులు తరలించనున్నారు. లడఖ్లో ఇండియన్ ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశృతి.. నీటిలో కొట్టుకుపోయిన ఐదుగురు జవాన్లు..
కాగా లడఖ్ ఘటనపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పందించారు. ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివన్నారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులర్పిస్తున్నానన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శిక్షణ సమయంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని చంద్రబాబు సర్కారుకు సూచించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
Here's Video
♦విజయవాడ చేరుకున్న లద్దాఖ్ ప్రమాదంలో చనిపోయిన జవాన్ల భౌతికకాయాలు
♦లద్దాఖ్ ప్రమాదంలో జవాన్లు సుభాన్ ఖాన్, నాగరాజు, కృష్ణారెడ్డి మృతి
♦గ్వాలియర్ నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో వచ్చిన జవాన్ల భౌతికకాయాలు
♦జవాన్ల భౌతికకాయాలను బాపట్ల, పెడన గిద్దలూరుకు తరలిస్తున్న అధికారులు pic.twitter.com/O4nrVlUzyS
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) July 1, 2024
YS Jagan Tweet
లడఖ్లో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు వీరమరణం పొందడం తీవ్రంగా కలిచివేసింది. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివి. వీరమరణం పొందిన జవాన్లలో కృష్ణా జిల్లాకి చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లాకి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లాకి చెందిన…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)