Tirumala, Dec 30: తిరుమల (Tirumala) మెట్లమార్గంలో చిరుత (Leopard) సంచారం మరోసారి కలకలం రేపింది. నడకదారిలో (Walkway) ఉన్న శ్రీ నరసింహ స్వామివారి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంటి కదలికలు రికార్డయ్యాయి. డిసెంబర్‌ 13, 26 తేదీల్లో ట్రాప్‌ కెమెరాల్లో చిరుత, ఎలుగు కదలికలను అధికారులు గుర్తించారు. దీంతో టీటీడీ అప్రమత్తమయింది. తిరుమలకు నడకమార్గంలో వెళ్లే భక్తులకు పలు సూచనలు చేసింది. అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా వెళ్లాలని సూచించారు. గతంలో అలిపిరి నడక మార్గంలో చిరుతలు సంచరించిన విషయం తెలిసిందే.

Srisailam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు అలెర్ట్‌.. రెండు రోజులు ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు.. ఎందుకంటే??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)