విశాఖపట్నం (Visakha)లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఐఓబి బ్యాంకులో గన్ మాన్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం ఐదు గంటలకు శంకర్రావు డ్యూటీకి యథావిధిగానే హాజరయ్యారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ.. తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. శంకర్రావు ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, వేగంగా వచ్చిన SUV కారు బైక్‌ను ఢీ కొట్టి గాల్లో పల్టీలు, అయిదుగురు అక్కడికక్కడే మృతి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)