తిరుపతిలో వైకుంఠ సర్వదర్శనం టోకెన్ల జారీలో అపశృతి చోటు చేసుకున్న సంగతి విదితమే. విష్ణు నివాసం, బైరాగి పట్టెడ, శ్రీనివాసం, సత్యనారాయణపురం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుమంది మృతి చెందారు. చాలామందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తోపులాటకు సంబంధించిన వీడియోలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఈ ఘటనలో మృతి చెందిన భక్తురాలి భర్త మాట్లాడుతూ..నా భార్య చనిపోయింది అని కనీసం ఫిర్యాదు కూడా చేయకుండా మార్చురీ కీ పంపించారు. భూమి మీద పుట్టలేదు అని చూపిద్దామని అనుకున్నారు అనుకుంటున్నానని మండిపడ్డారు. మరొక భక్తుడు గత 5 సంవత్సరాల నుండి వస్తున్నాను కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు, ఈ సంవత్సరమే ఇలా జరిగింది.. చచ్చిపోతాను అనుకున్నాను కానీ దేవుడి దయవల్ల బతికాను. ఒక్కసారిగా గేట్లు తియ్యడం వల్లే తోపులాట జరిగిందని భక్తుడి ఆవేదన చెందారు. ఉదయం నుంచి పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి కాపలా కాస్తున్నారని మరొక భక్తుడు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 తిరుపతిలో తొక్కిసలాట, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడిన చంద్రబాబు, భక్తులు భారీగా వస్తారని తెలిసీ ఎందుకు ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం

Tirupati Stampede Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)