కాసినో వ్యవహారంపై మంత్రి కొడాలి నాని, రాష్ట్ర డీజీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్నను అరెస్ట్‌ చేశారు. గుడివాడ వ్యవహారంపై మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా మంత్రిని చంపుతానంటూ రక్తం కళ్ల చూస్తానంటూ విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు అందగా వివరణ కోరేందుకు ఈరోజు(సోమవారం)బుద్ధా వెంకన్న ఇంటికి వెళ్లారు. పోలీసుల రాకతో టీడీపీ నేతలు కార్యకర్తలు.. పోలీసుల విచారణకు భంగం కల్గించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోగా, చివరకు బుద్ధా వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)