తిరుమల(Tirumala) మొదటి ఘాట్ రోడ్డులో అడవి ఏనుగులు హల్ చల్ చేశాయి. ఘాట్ రోడ్డుకు అనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల(Elephant) గుంపు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాయి. ఏనుగుల ఘీంకారాలకు ఘాట్ రోడ్డు(Tirumala Ghat Road)లో ప్రయాణిస్తున్న శ్రీవారి భక్తులు, ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైయ్యారు.
ఘాట్ రోడ్డులో వాహనంలో వెళ్తున్న ప్రయాణికులు ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్ లో బంధించారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ(TTD) ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమయ్యారు. చెన్నైలోని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్, సింగపూర్ కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్ ఇవాళ ఉదయం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. పవన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, ప్రజల సహకార, సంయుక్త అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. వీడియో ఇదిగో, సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమైన పవన్ కళ్యాణ్, ఘనమైన ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన సింగపూర్ కాన్సుల్ జనరల్
Wild Elephants Roam on Tirumala Ghat Road
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల హాల్ చల్.. పరుగులు తీసిన భక్తులు
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో అడవి ఏనుగులు హల్ చల్ చేశాయి. ఘాట్ రోడ్డుకు అనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాయి.
ఏనుగుల ఘీంకారాలకు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న శ్రీవారి… pic.twitter.com/nlcgpOz4RF
— Aadhan Telugu (@AadhanTelugu) January 23, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)