భారీ వర్షాలకు నీటమునిగిన పంటలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఆమె నడుము లోతు నీళ్లలో రైతుల సహాయంతో దిగి పరిశీలన చేశారు. నీళ్లలో దిగి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పైన ఉన్న ఎర్రకాలువ మరమ్మతుల జరగలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కనీసం ప్రాజెక్టులకు మరమ్మతులు చేయలేదన్నారు. ఆఖరికి పూడికలు కూడా తీయకపోవడంతో పొలాల్లోకి నీళ్లు వచ్చాయన్నారు. చంద్రబాబు రైతులను ఆదుకోవాలని కోరారు. ఏపీ దాడులపై కేంద్ర హోం మంత్రి వెంటనే స్పందించాలి, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు, వైఎస్ జగన్ పోరాటానికి అండగా నిలబడతామని వెల్లడి
Here's Video
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం, నందమూరు గ్రామాల్లో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. pic.twitter.com/1In0WUwlu3
— ChotaNews (@ChotaNewsTelugu) July 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)